సిమెంట్ రోడ్డు నిర్మించి అంబటి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి

  • నిరాహారదీక్షకు దిగిన జనసేన నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, నకరికల్లు గ్రామంలోని మెయిన్ రోడ్డులోని హుస్సేన్ హాస్పిటల్ వద్దనుండి శివయ్య తండా వెళ్లే మార్గంలోని సిమెంట్ రోడ్డు వేస్తా అని స్థానిక గ్రామస్తులకు మాట ఇచ్చి మాట తప్పిన అంబటి రాంబాబు గారు ఎన్నికల హామీలో భాగంగా చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలంటూ నకరికల్లులో నిరాహారదీక్షకు దిగిన జనసేన పార్టీ నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీకి నకరికల్లు గ్రామస్తులు సంపూర్ణ మద్దతుని, సంఘీభావాన్ని తెలియపరిచారు. స్థానిక ప్రజల పక్షాన నెల రోజుల క్రితమే ముందస్తుగా సదరు రోడ్డు నిర్మాణం చేపట్టాలని లేని పక్షంలో ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని అల్టిమేటం ఇచ్చిన లక్ష్మీ గురువారం దీక్షకు దిగడం జరిగింది. సమంజసమైన ఆమె డిమాండుని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కూడా అంబటి రాంబాబు గారు తక్షణమే పరిశీలించి పరిష్కరించవలసిందిగా జనసేనపార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, ఎస్సీ నాయకులు చిలక పూర్ణ, నకరికల్లు గ్రామ సీనియర్ నాయకులు కాసా రామకృష్ణ, మిర్యాల జగన్, మిరియాల రాజ్యలక్ష్మి, తోట శ్రీను, షేక్ సైదయ్య, మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, కుంకలగుంట ఎనిమిదో వార్డు నెంబర్ మిద్దెం మహాలక్ష్మి, మిథెం లక్ష్మీనారాయణ మండల జనసైనికులు పాల్గొన్నారు.