రేణిగుంట డీఎస్పీ కి హైకోర్ట్ మొట్టికాయ !!

తిరుపతి ప్రెస్స్ క్లబ్ నందు గురువారం జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 17 న రేణిగుంట బస్టాండ్ నందు కలెక్టర్ ఆదేశాలు ఉల్లంఘిస్తూ అక్రమ షాపులు నిర్మాణాన్ని ఖండిస్తూ జనసేన శాంతియుత నిరసన ధర్నా చేస్తుంటే పోలీసులు దురుసుగా ప్రవర్తించి బలవంతంగా అరెస్టు చేసి, డీఎస్పీ పోలీసు స్టేషన్లో స్థాయి తగ్గి వ్యవహరించిన తీరును ఎస్పీ గారికి ఫిర్యాదు చేశామని, ఆ నెపంతో డీఎస్పీ ఇంఛార్జి వినుత గారి పైన, భర్త కోటా చంద్రబాబు పైన అక్రమ తప్పుడు కేసు పోలీసులే సుమోటోగా బానాయించారని, ఆ కేసును సవాలు చేస్తూ హైకోర్ట్ ను ఆశ్రయిస్తే నిన్నటి రోజు గౌరవ హైకోర్ట్ పోలీసుల తీరును తప్పు బడుతూ.. తప్పుడు కేసుగా పరిగణించి డీఎస్పీ పెట్టిన అక్రమ తప్పుడు కేసుపై పర్మనెంట్ స్టే ఆర్డర్ ఇచ్చారని తెలియజేశారు. ప్రజా సమస్యలపై పోరాడితే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని పోలీసులను దుర్వినియోగం చేస్తున్నారు, రక్షించాల్సిన పోలీసులు, బక్షకులుగా మారారని, డీఎస్పీ స్థాయి వ్యక్తులు దిగజారి ప్రవర్తిస్తున్నారని తెలిపారు. కేసులతో జనసేన పోరాటాలను, నియోజకవర్గంలో మమ్మల్ని ఆపలేరు అని తెలిపారు. ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యే మాటలు విని కేసులు ఇంకోక్కసారి పెడితే జిల్లా లోని జనసైనికులు పోలీస్ స్టేషన్ను ముట్టడించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇష్టానుసారం యూనిఫాం ఉందని వ్యవహరిస్తే కోర్టుల ద్వారా తగిన బుద్ధి చెబుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు త్యాగరాజులు, నితీష్ కుమార్, జ్యోతి కుమార్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.