పి.వికి అత్యున్నత గౌరవసత్కారం- తెలుగు జాతికి గర్వకారణం

కాకినాడ సిటి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో 40 డివిజన్లోని ఈశ్వర పుస్తక భాండాగారం వద్ద అడబాల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కీ.శే. పి.వి.నరసింహారావుకి భారతరత్న అవార్డు ప్రకటించిన సందర్భంగా వారి చిత్రపటానికి పూలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. ఇటీవల కేంద్రప్రభుత్వం తెలుగువారైన కీర్తిశేషులు మాజీ భారత ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు గారికి దేశాత్యున్నత పురస్కారం అయిన భారతరత్న అవార్డుని ప్రకటించిన సందర్భంగా జనసేనపార్టీ శ్రేణులు తమ హర్షాన్ని స్థానిక ప్రజలతో కలిసి పంచుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఆనాడు దేశం క్లిష్టమైన ఆర్ధిక స్థితులలో బంగారాన్ని ప్రపంచబ్యాంకు వద్ద తాకట్టుపెట్టి అప్పు తెచుకున్న వేళలో పి.వి.నరసింహారావు గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందనీ, తరువాత ఆయన తీసుకున్న ఆర్ధిక సంస్కరణలతో నేడు ప్రపంచదేశాల ఆర్ధిక పరపతిలో అయిదవ స్థానాన్ని కలిగిఉండటానికి ఆనాడు ఆయన వేసిన బీజమే అని పేర్కొన్నారు. ఆయన బహుభాషాకోవిదుడే కాక గొప్ప రాజనీతిఙ్ఞుడన్నారు. తమ నాయకుడు శ్రీ. పవన్ కళ్యాణ్ గారు 2020 సంవత్సరంలోనే పి.వి గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారనీ, నేడు అది గౌరవ ప్రధాని శ్రీ.నరేంద్రమోడీ గారు నెరవేర్చారనీ ఇందుకు ధన్యవాదాలు తెలియచేసారు. ఒక తెలుగువాడికి దేశ అత్యున్నత గౌరవసత్కారం లభించడం తెలుగు జాతి గర్విస్తోందనీ ఇది భావితరాలు మరిచిపోవని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జనసేన నాయకులు మనోహర్ గుప్త, కంట రవిశంకర్, సుంకర రామకృష్ణ, సమీర్, వాసిరెడ్డి సుబ్బారావు, చీకట్ల శ్రీనివాసు, మేడూరి బాలకృష్ణ, మండపాటి ఉదయ్ భాస్కర్, రావాడ గోపి, మాచిరాజు సురేష్, రేపల్లి దుర్గాప్రసాద్, మిరియాల హైమావతి తదితరులు పాల్గొన్నారు.