కంభం పట్టణంలో ఇంటింటా ఎన్డీయే కూటమి ప్రచారం

గిద్దలూరు నియోజకవర్గం, కంభం పట్టణంలో కాపవీధి, దాల్ సాబ్ వీధి ఇంటింటికి తిరిగి ఎన్నిక ప్రచారం నిర్వహించి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీయే కూటమి శాసన సభ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డి గారికి, పార్లమెంట్ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన అశోక్ రెడ్డి సోదరుడు జగన్నాథ్ మరియు బీజేపీ టీడీపీ నాయకులు. కూటమి నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహ రావు, కంభం మండల అధ్యక్షులు తాడిసెట్టీ ప్రసాద్, మండల నాయకులు సందు నారాయణ, కార్యదర్శి రంగనాయకులు సంయుక్త కార్యదర్సులు వేము ప్రవీణ్ కుమార్, శివ కేశవ, నల్లబోతుల గోపి చంద్, బొగెం శ్రీను, శేషు, ప్రసాద్, చంద్ర, కృషంశెట్టి కాశయ్య, నవత శ్రీను తదితరులు పాల్గొన్నారు.