32 వార్డులో వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచార ర్యాలీకి భారీ స్పందన

  • డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం
  • పలు ప్రాంతాలలో ప్రజల నుంచి ఘన స్వాగతం
  • కూటమి అభ్యర్థికి జై కొడుతున్న జనం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డులో బిజెపి, టిడిపి, జనసేన కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచార ర్యాలీ బుధవారం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వార్డులో భీమ్ నగర్, పూతి వారి వీధి, అమ్మవారి వీధి, అల్లిపురం, సౌత్ జైల్ రోడ్డు తదితర ప్రాంతాలలో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ జనసేన నాయకులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచార ర్యాలీకి వందలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు. ప్రతి చోట ఘన స్వాగతం లభించిందని తెలిపారు. జనసేన, బిజెపి, టిడిపి బలపరిచిన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. గత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికార మార్పు జరుగుతుందని పేర్కొన్నారు. మెజార్టీ సీట్లు కూటమి అభ్యర్థులు గెలుచుకుంటారని చెప్పారు. అలాగే దక్షిణ నియోజకవర్గంలో కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ మెజార్టీ ఓట్లతో గెలుపొందడం ఖాయమని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలన్న కూటమి అధికారంలోకి తప్పకుండా రావాలని ప్రజలు ఈ దిశగా ఆలోచించాలని చెప్పారు. అయితే ప్రజలలో కూడా మార్పు వచ్చిందని ఎవరికి ఓటు వేయాలనేది ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం కూటమి అభ్యర్థులందరూ గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుల రాజశేఖర్, కేదార్నాథ్, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.