హుస్నాబాద్ జనసేన ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు

హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ పట్టణ మరియు మండలంలోని ప్రతి గ్రామాల్లో బెల్టు షాపులను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని, నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. చట్టవిరుధ్ధంగా నిర్వహిస్తున్నటువంటి బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని, లేని యెడల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయసారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పొడి శెట్టి విజయ్, మొలుగూరి అరవింద్, బత్తుల జగదీష్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.