గడప గడపకు కపటి ప్రేమ

పుట్టపర్తి ఎమ్మెల్యే శనివారం గడప గడప పేరుతో మరోసారి నియోజకవర్గ ప్రజలను మాయ చెయ్యడానికి వస్తూన్న నేపథ్యంలో.. పుట్టపర్తి నియోజవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో భాగంగా నాయకులు వైసీపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. వైసీపీ పార్టీ అదికారంలోకీ వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అయింది. ఇప్పటి వరకు మీరు చేసిన అబివృద్ది ఏమి …. రాష్ట్రానికి రాజధాని ఎక్కడ..?, సంపూర్ణ మధ్యపానం ఎక్కడ..?, నియోజవర్గంలో 193 చెరువులకి నీరు ఎక్కడ..?, నియోయోజకవర్గంలో చిన్న చిన్న పరిశ్రమలు ఎక్కడ..?, పుట్టపర్తి సుoదరికర్ణ ఎక్కడ..? అని ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యాక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్ధుల్, జిల్లా కార్యదర్శి బొగ్గరం శ్రీనివాస్, డాక్టర్ తిరుపతేంద్ర, మేకల పవన్ కళ్యాణ్, గణేష్, అభి తదితరులు పాల్గొన్నారు.