ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీ ముందు నేనుంటా: భూమా మౌనిక

ఏపీ పాలిటిక్స్ లో అఖిల ప్రియ అరెస్ట్ ఇష్యూ ఎంత హీట్ క్రియేట్ చేసిందో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు భూమా మౌనిక చేసిన వ్యాఖ్యలు కూడా అంతే హీట్ క్రియేట్ చేస్తున్నాయి. నేనున్నా అంటూ.. మౌనిక ముందుకు రావడంతో.. కార్యకర్తల్లో కాస్త ధైర్యం వచ్చింది. పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ కు మంచి పాయింట్ దొరికింది.

అఖిల ప్రియ అరెస్ట్, ఆమె భర్త భార్గవ్ రామ్ అరెస్ట్ తో ఆళ్లగడ్డలో.. భూమా వర్గీయులు, ఆమె ఫాలోవర్లు.. కేడర్ మొత్తం నిరుత్సాహానికి గురైంది. ఇష్యూ పక్క స్టేట్ తెలంగాణలో కావడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తప్పడం లేదు. పూర్తిగా కార్నర్ కావడం ఎలా బయటికొస్తారో అఖిల ప్రియ అనే టెన్షన్ పెరిగిపోయింది. ఏ వన్ ఏ టూ అంటూ.. ఏవేవో మాటలు వింటూ మీడియాలో చూస్తూ.. డైలమాలో పడిపోయారు. ఇదే సమయంలో కరెక్ట్ టైం చూసి కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు భూమా మౌనిక.

అఖిల ప్రియాకి బెయిల్ వచ్చాక.. హైదరాబాద్ నుంచి.. ఆళ్లగడ్డ దాకా ర్యాలీగా తీసుకొద్దాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. కార్యకర్తలకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు ఫోన్ చేయండి. నాకు కాస్త ఇబ్బంది ఉండి ఇన్నాళ్లూ నియోజకవర్గానికి దూరంగా ఉన్నాను. ఇకపై అలాంటి సమస్యేం లేదు. మిమ్మల్ని నేను చూసుకుంటాను. ఏ ప్రాబ్లమ్ వచ్చినా మీ ముందు నేనుంటా.. అన్ని బాధ్యతలు నేను తీసుకుంటా. జస్ట్ నాకు ఫోన్ చేయండి అన్నారు భూమా మౌనిక.

అఖిల ప్రియ, భార్గవ్ రామ్ ల అరెస్ట్ వెనుక పెద్ద పెద్ద రాజకీయ తంత్రాలు ఉన్నయ్. వాటన్నీటినీ చేధిద్దాం.. డీజీపీని.. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తాం.. జరుగుతున్న కుట్రలు గురించి వివరిస్తాం అన్నారు భూమా మౌనిక. చూస్తుంటే మౌనిక వ్యాఖ్యలు పలు రకాల హింట్స్ ఇచ్చినట్లు ఉంది అంటున్నారు ఏపీ పొలిటికల్ అనలిస్టులు. నియోజక వర్గంలో బాధ్యతలు ఇకపై మౌనికనే చూసుకుంటారేమో అన్నట్లుంది అనే టాక్ నడుస్తోంది.