ఐ. పంగిడిలో వార్డు అభ్యర్థిగా జనసేన బలపరిచిన నాగమణి విజయం

కొవ్వూరు నియోజకవర్గం: ఐ పంగిడి గ్రామంలో శనివారం జరిగిన పంచాయతీ మధ్యంతర ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పికే రంగారావు బలపర్చిన శ్రీమతి కొడమంచిలి నాగమణిని అఖండ మెజారిటీతో గెలిపించిన వార్డు ప్రజలకు, అలాగే మన గెలుపు కోసం కృషి చేసిన గ్రామాధ్యక్షులు వాసిరెడ్డి వెంకటేష్ కన్నప్ప, కొప్పాక విజయ్ కుమార్, మడిచర్ల నాగరాజు, చోళ్ళ వేంకటేశ్వరరావు, పూటి జగదీష్ బొల్లా గోవిందు, మెరిపో నాని (మెట్ట), బిజేపి మంఢలాధ్యక్షులు శ్రీ పెరుగు పోతురాజు మొదలైన నాయకులకు, గాయత్రీ వేంకటేశ్వరరావు, వీరరాఘవులు, షితాల్, సుభాషిణి, జనసైనికులుకు, వీరమహిళలకు అభిమానులు అందరికీ కొవ్వూరు జనసేన మండల ప్రధాన కార్యదర్శి పెరుగు శివ పేరు పేరునా ధన్యవాదాలు మరియు విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అధికార వైసీపీ వారు రకరకాల ఇబ్బందులు గురిచేచి, భయపెట్టినా బెదరకుండా వైసిపి కంచుకోట అయిన 8వ వార్డులో ఓడిపోతాం అని తెలిసి కూడా మన నియోజకవర్గంలో జనసేన ఉనికిని కాపాడటానికి ధైర్యంగా అధికార వైసీపీకీ దీటుగా పోటీలో నిలిచి రూపాయి పంచకుండా ప్రజా అవసరాలు ఆలోచన చేసి ముందుచూపుతో వార్డులో జనసేనను గెలిపించిన మేమంతా విలువలు కలిగిన రాజకీయం నాయకులం. జనసేన పార్టీ తరుపున విజయం సాధించిన శ్రీమతి కొడమంచిలి నాగమణి, వారి కుటుంబం సభ్యులు అంతా విలువలు కలిగిన నాయకులు వారందరికి కృతజ్ఞతలు, పాదాభివందనం. మన పార్టీ ఎప్పుడూ వారికి అండదండలుగా ఉంటుందని పార్టీ తరపున భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది మా ఊరులో జనసేన ముసుగులో నొటా రాజకీయాలు, కోవర్ట్ రాజకీయాలు చేస్తూ అధికార వైసీపీ ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తూ జనసేన అభ్యర్థిని ఓడించడానికి విశ్వప్రయత్నం చేసినా ఒక నోటా నాయకుడు విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. దెయ్యూలు వేదాలు వర్నించినట్లు అతని మాటలు, ప్రవర్తన ఉన్నాయి. మా గ్రామంలో వైసీపీ ప్రభుతెవానికి వ్యతిరేకంగా జనసేనాని పిలుపు మేరకు ఏ ఒక్క కార్యక్రమం ఆ నోటా నాయకులు ఇప్పటి వరకు మా గ్రామంలో చేయలేదు. అదే వ్యక్తి గతంలో జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో జనసేన తరుపున మా అందరితో కలసి పనిచేసి ఎన్నికలు రద్దైన తరువాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వార్డు స్థాయి నుంచి ప్రశ్నించాలి అని పిలుపు నివ్వడం జరిగింది. కానీ ఈ వ్యక్తి జనసేనకు ఈ ఎన్నికల్లో మేండిడేడ్ ఉండదు అని సొంత ప్రయోజనాల కోసం వైసీపీ నేతలతో చేతులు కలిపి చీకటి ఒప్పందాలతో జనసేన ముసుగులో కోవర్ట్ రాజకీయం చేయటం, వారి భార్యను వైసీపీ వార్డు నెంబరుగా గెలిపించుకోవటం జనసేనను పంచాయతీలో ఒక వార్డు నెంబరు కూడా లేకుండా చేయటం విలువలు కలిగిన రాజకీయమా? ఈ విషయం తప్పు అని ప్రశ్నించిన వారిపై హత్య ప్రయత్నం చేసి అతనిపై వారి కుటుంబ సభ్యులపై, సపోర్ట్ చేసిన జనసేన సీనియర్ నాయకులు కొప్పాక విజయ్ కుమార్ పై, గ్రామ పెద్ద మన జనసేన పార్టీ నీ బలపర్చిన శ్రీ పికె రంగారావుపై వైసిపి మంత్రి అండదండలతో అక్రమ కేసులు పెట్టించి ఇప్పటికే అందరిని కోర్టులు చుట్టూ తిప్పడం విలువలు కలిగిన రాజకీయమా?. జనసేన తరుపున వార్డు సభ్యులుగా పోటీ చేసిన వారందరిని మా గ్రామంలో వైసీపీ నాయకులు కలిసి అనేక ఇబ్బందులకు గురిచేయడం విలువలు కలిగిన రాజకీయమా? అదే వ్యక్తి ఎంపిటిసి ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు వద్దు నోటా ముద్దు అని జనసైనికులును తప్పు దోవ పట్టించి బిసి, ఎస్ సి ఎంపిటిసి అభ్యర్థులను జనసేనను ఓడించటం విలువలు కలిగిన రాజకీయమా? అదే వ్యక్తి నిన్న జరిగిన పంచాయతీ మధ్యంతర వార్డు ఎన్నికల్లో జనసేన తరుపున మేమంతా ఈ నెల 8వ తేదీన జనసేన కండువాలతో నామినేషన్ బిజేపి జనసేన నాయకులు కలిసి అభ్యర్థితో నామినేషన్ వేయించిన తరువాత వైసీపీ వారికి ఏకగ్రీవం చేయటానికి అనేక కుట్రలు, కుతంత్రాలు చేసి పలించకపోయే సరికి వైసీపీ తరఫున చీకటి ఒప్పందాలు చేసుకుని మా పంగిడిలో జనసేన తరుపున ఒక్క వార్డు నెంబరు కూడా గెలవకూడదని కంకణం కట్టుకుని వైసీపీకీ పనిచేసి జనసేనకు ఓటు వెయ్యద్దు అని ఆ వార్డు ఓటర్లకు అదే పనిగా తెలిసిన వారికి ఫోన్లు చేసి, జనసేనకు ఓట్లు వెయ్యద్దు అని పదే పదే చెప్పడం విలువలు కలిగిన రాజకీయమా ఆలోచన చేయండి? వైసీపీ గెలుస్తుంది అని లక్షల రూపాయలు పందాలు వేసి జనసేన అభ్యర్థి గెలిచిన వెంటనే అక్కడనుంచి పారిపోయిన ఆ వ్యక్తి విలువలు కలిగిన వ్యక్తా?. జనసైనికులు, వీరమహిళలు ఆలోచన చేయండి. జై జనసేన.. జనసేన అంటే ఓడిపోయినా పారిపోకుండా జనసేనాని ఆశయం కోసం నిజాయితీగా నిశ్వార్ధంగా శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయసాధన కోసం వారి వారి స్థొయిలో ధైర్యంగా నిలబడి, అధికార వైసీపీ చేసే తప్పులను ప్రశ్నించి, పోరాడి పనిచేసే వారే విలువలు కలిగిన నిజమైన జనసైనికులు, నాయకులు, వీరమహిళలు. ఇక నుంచైనా తన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపం చెంది నిజాయితీగా నిశ్వార్ధంగా జనసేనాని ఆశయం కోసం పనిచేయాలని ఆ భగవంతుడు సాక్షిగా ప్రమాణంచేసి మన జనసేన పార్టీలో విలువలు కలిగిన నాయకులుగా పనిచేయాలని కోరుకుంటున్నామని పెరుగు శివ పేర్కొన్నారు.