ఓటీటీలో ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’

యంగ్ హీరో సుశాంత్ ప్రధానపాత్రలో ఎస్ దర్శన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ఇచ్చట వాహనాలు నిలుపరాదు. మొన్ననే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు పార్కింగ్ చేస్తే ఫైన్ పడుతుంది. అంతే కానీ ఇలా అవుతుంది అని ఎవరైనా అనుకుంటారా…అంటూ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఓ వీడియోను పోస్ట్ చేసింది.

సెప్టెంబర్ 17 నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గా విడుదలకానుందని అధికారికంగా ప్రకటించారు. ఇక మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా వెన్నెల కిషోర్ ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.