సత్యదేవ్ ‘తిమ్మరుసు’ టీజర్

విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రానికి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా.. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ విడుదల చేసి సినిమా మంచి సక్సెస్‌ కావాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

‘తిమ్మరుసు’ టీజర్ లో సత్యదేవ్‌ లాయర్‌ పాత్రలో కనిపిస్తూ.. ‘కేసు గెలిచామా ఓడామా అన్నది కాదు ఇంపార్టెంట్.. సంపాదన ఎంతనేదే ఇంపార్టెంట్‌.. అని ఓ లాయర్ అంటుంటే.. నాకు మాత్రం న్యాయం గెలవడమే ఇంపార్టెంట్ సర్’ అంటూ సత్యదేవ్ చెప్తున్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. స్టోరీ లైన్ ఏంటన్నది రివీల్ చేయకుండా.. సస్పెన్స్ మూడులో టీజర్ ని కట్ చేశారు. ఓ కేసులో న్యాయం గెలవాలని సత్యదేవ్ తాపత్రపడటం.. ఇందుకోసం పరిశీలన, పరిశోధనలు చేయడం.. టీజర్ చివర్ల్లో గన్ పట్టియాక్షన్ లోకి దిగడం చూడొచ్చు. మొత్తానికి తిమ్మరుసు టీజర్ ఆకట్టుకునేలా ఉంది.