మెగాఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తాం: త్యాడ రామకృష్ణారావు

  • సీపీఐ నారాయణ, చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన జిల్లా చిరంజీవి యువత
  • సీపీఐ నారాయణ మాటలను వెనక్కి తీసుకోవాలని జిల్లా చిరంజీవి యువత డిమాండ్

విజయనగరం జిల్లా: ప్రముఖ సినీనటులు, మాజీ రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి పై సీపీఐ నారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మంగళవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి నారాయణ వాఖ్యలపై ఖండించారు.

జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద అంబేద్కర్ సామాజిక భవనంలో మీడియా సమావేశంలో ముందుగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ మా ఆరాధ్యాదైవం, మా అభిమానుల సేవలకు మార్గదర్శి, మథర్ తెరిసా తరువాత సేవలకు ప్రతిరూపమైన చిరంజీవి పై నారాయణ చేసిన వ్యాఖ్యలకు జిల్లా చిరంజీవి యువత తరుపున ఖండిస్తున్నామని, రాష్ట్రాంలో మేము బతికే ఉన్నాం అని పబ్లిసిటీ లేని కుక్కలన్నీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావించుకొని పబ్లిసిటీ తెచ్చుకుంటాయాని, అలాంటికోవకు చెందిన కుక్కే ఈ నారాయణ అని మండిపడ్డారు.

సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా సినీ కార్మికులను, అభిమానులను, కళాకారులను, తను మాధ్యమాలాద్వారా చలించి ఎంతో లెక్కలేనిమందికి ఆర్ధికంగా ఆదుకునే ఆపద్భాంధువుడని, ప్రపంచానికే ఆదర్శమైన, ఇటువంటి మహనీయున్ని అనటానికి మాటలేలా వచ్చాయిని నీలాదీశారు. చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే నారాయణ పై అఖిలభారత చిరంజీవి యువత,రాష్ట్ర చిరంజీవి యువత ఆదేశాల మేరకు దీనిపై మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.

విజయనగరం జిల్లా చిరంజీవి యువత కార్యదర్శి డాక్టర్ ఎస్. మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రక్తదానం, నేత్రధానంతో పాటు కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఆక్సీజన్ సిలండర్లు ప్రజలకు అందించి ప్రాణదాతగా నిలిచి, మాకు అభిమానులకు స్ఫూర్తి ప్రధాతగా ఉన్న మా దైవం చిరంజీవి ని నారాయణ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, మా మెగాఫ్యామిలీ హీరోల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాటమే మా ధేయమని, నారాయణ, చిరంజీవి అభిమానులకు క్షమాపణ చెప్పాలని, చిరంజీవిపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇకపై మా మెగాఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తామని వారిరిరువురు హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా చిరంజీవి యువత నాయకులు,జనసేన యువనాయకులు, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యక్షులు చెల్లూరి ముత్యాల నాయుడు, సభ్యులు రొయ్యిరాజు, సీర కుమార్, గూడ రాజేష్, జడ్డు జనా, గాడి బంగార్రాజు, చుక్క రవి, గౌరి నాయుడు, దువ్వి రాము, ఎర్ని బాబు తదితరులు హాజరయ్యారు.