పవన్ కళ్యాణ్ ని అరెస్టు చేస్తే విశాఖపట్నం ముట్టడికి మేము వెనకాడము

  • జనసేన నిరసన కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, బత్తుల బలరామకృష్ణ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ శనివారం జరిగినటువంటి పవన్ కళ్యాణ్ పర్యటన నిమిత్తం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది. అదే సమయంలో విశాఖ గర్జనలో భాగంగా వైసిపి నాయకురాలు రోజా విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి దుర్భాషలాడుతూ దూషించింది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు సమన్వయం పాటించి అందరూ జరగబోయే ర్యాలీ మీద దృష్టి పెట్టారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా ఎటువంటి గొడవలు జరగకుండా జనసైనికులు, జనసేన నాయకులు ఎంతో వైభవంగా పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆ జనసంద్రోహాన్ని చూసి ఈర్షతో వైసీపీ శ్రేణులు పధకం ప్రకారం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న జన సైనికులలో కలిసిపోయి కావాలని వైసీపీ శ్రేణులు మీద దాడి చేయించుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఈ హైడ్రామా ప్రశాంతి కిషోర్ నేతృత్వంలో రోజా అధ్యక్షతన గొప్ప ప్లాన్ తో జరిగింది. అక్కడ జరిగిన సమయంలో రోజా ఆమె మీద వైసీపీ శ్రేణులతో, అనుచరులతో దాడి చేయించుకుని ముఖంలో ఎటువంటి కోపము గాని బాధ గాని లేకుండా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది‌ అంతా జరిగిపోయాక వారికి కావాల్సిన ఆధారాలు సేకరించుకుని వారి కుట్రలో భాగంగా మీడియా ముఖంగా కొత్త హైడ్రామాకు తెర లేపారు. రోజా నటనా ప్రావీణ్యం మనందరికీ విదితమే. కాబట్టి ఆమె మీడియా ముందు బాగా నటించారు. కానీ ధర్మం, మంచితనం, ఓర్పు అనేది మా నాయకుడి ద్వారా మేము అలవర్చుకున్న నడవడి. ర్యాలీ మార్గంలో కావాలని విద్యుత్ సరఫరా ఆపేసి ఈ ప్రభుత్వం తన చేతకాని తనాన్ని చూపించుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా జనసైనికులు ఉన్నంతవరకు మీరందరూ పవన్ కళ్యాణ్ ని ముట్టుకోలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పక్క ప్లానింగ్ తో పోలీసులు బలగాలను ఉపయోగించి జనసేన మీద దాడి చేసి అనంతరం నోవాటెల్ హోటల్ లో ఉన్న జనసేన నాయకులను విచక్షణ రహితంగా ఎటువంటి తప్పు లేనప్పటికీ అరెస్టులు చేయడం పవన్ కళ్యాణ్ గదిని పదేపదే చెక్ చేయడం పవన్ కళ్యాణ్ వాహనం తాళాలను అడగడం ఇలాంటి చర్యలు చేసి వైసిపి తన చేతకానితనాన్ని మరొక్కసారి నిరూపించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ని తలపించే ఈ ప్రభుత్వ పద్ధతిని వ్యతిరేకిస్తూ రాజానగరం నియోజకవర్గంలో నుంచి అరెస్టయినా మా జనసేన నాయకులకు మద్దతుగా భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పోలీసులు, అధికారిక అధికారులు వారి పరిధి వరకు పనిచేయాలని ప్రజాక్షేమమే వారి అంతిమ వీధి కావాలని ఏ పార్టీ విధానాలకు వత్తాసు పలుకుకూడదని బత్తుల ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే రాజానగరం నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో విశాఖపట్నం వెళ్ళి మా అధినేత పవన్ కళ్యాణ్ కి కవచంలా ఏర్పడటానికి మేము సిద్దంగా ఉన్నామని, అధినేతకి ఎటువంటి ఆటంకం కలిగించినా.. మేము అన్నిటికీ సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమం కోరుకొండ బస్టాండ్ వద్ద భారీ స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, బదిరెడ్డి దొర, సూరపురెడ్డి రాజారావు, మద్దిరెడ్డి బాబులు, మాధవరపు శ్రీనివాస్ (ఆలీ), బోయిడి వెంకట్, గల్లా రంగ, నాతిపాము దొర, అడ్డాల శ్రీను, అడ్డాల దొర, వేగిశెట్టి రాజు, గంగిశెట్టి రాజేంద్ర, కవల శ్రీరాం, డి.డి, తెలగంశెట్టి మధు, కొత్తపల్లి బుజ్జి, బుద్దాల అర్జున్, డి.ఎం.ఎస్, సూరంపూడి సురేష్, గుర్రాల వెంకటేష్, సుంకర మణి కుమార్, నక్క చైతన్యలతో పాటు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.