వారపు సంతలో కనీస సదుపాయాలు కల్పిస్తాం: గంగారపు రామదాస్ చౌదరి

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె: ప్రతి మంగళవారం వేలమందితో కళకళలాడే మదనపల్లె వారపు సంతలో కనీస సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలం అయ్యారని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి విమర్శించారు. ‌మంగళవారం మదనపల్లె వారపు సంతలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన పట్టణ బాట కార్యక్రమం నిర్వహించారు. ‌ఈ సందర్భంగా వ్యాపారస్తులు, సంతకు వచ్చిన కొనుగోలు దారులకు జనసేన పార్టీ గాజు గ్లాసు ను వివరిస్తూ జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంతకు వచ్చిన వ్యాపారస్తులు, కూరగాయలు విక్రయాల చేసే రైతులు తమ సమస్యలు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ వ్యాపారస్తుడిని మాట్లాడిన, రైతుని మాట్లాడిన,కొనుగోలు దారుడుని మాట్లాడిన రాబోయేది జనసేన టీడీపీ సంక్తీర్ణ ప్రభుత్వంమేనని వాళ్లే చెప్పడం జరుగుతుందనన్నారు. నిత్యం కళకళలాడే మదనపల్లె వారపు సంతలో కనీస సదుపాయాలు లేకపోవడం బాధకరం అన్నారు. మరుగుదొడ్లు, విశ్రాంతి భవనం ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. దుర్మార్గపు వైసిపి పాలన నుండి విముక్తి పొందాలని మదనపల్లె ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్రా ప్రజలు అందరూ కోరుకొంటున్నారని వివరించారు. నారాలోకేష్ యువగళం ముగింపు యాత్ర సంధర్భంగా తెలుగుదేశం శ్రేణులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వంలో శాంతియుతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకొంటామని అలాగే యువతకు ఉపాధి కల్పన, రైతంగానికి గిట్టుబాటు ధర, మహిళలకు సాధికారత అన్ని విభాగల్లో చిత్తశుద్ధి తో జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, రెడ్డెమ్మ, చంద్రశేఖర, నవాజ్, జంగాల గౌతమ్, జయ, రాజారెడ్డి, రవి, విజయ్ కుమార్, గంగులప్ప, ఆది నారాయణ, నాగవేణి, లవన్న, పవన్ శంకర, గణేష్, తోట కళ్యాణ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.