ఓటరు కార్డు లేకపోతే .. వీటిని ప్రత్యామ్నాయంగా తీసుకురండి

గ్రేటర్ హైదరాబాద్‌లో డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఈ క్రింది కార్డులను చూపించి ఓటు వేసే అవకాశం ఇస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి డిఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్‌ కేంద్రంలో వారి గుర్తింపు నిర్థారణకు ఏదైనా గుర్తింపు కార్డును చూపవచ్చన్నారు. ఈ కింద పే ర్కొన్న గుర్తింపు పత్రాల్లో ఏవైనా ఒకటి చూపాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు:

1. ఆధార్ కార్డు,

2. పాస్‌పోర్ట్‌,

3. డ్రైవింగ్ లైసెన్స్‌,

4. ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫైకార్డ్‌,

5. ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్‌, 6. పాన్ కార్డు,

7. ఆర్‌.జి.ఐ, ఎన్‌.పి.ఆర్ స్మార్ట్ కార్డు,

8. జాబ్ కార్డు,

9. హెల్త్ కార్డు,

10. ఫోటోతో కూడిన పింఛన్‌ డాక్యుమెంట్,

11. ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారగుర్తింపు పత్రం,

12. రేషన్ కార్డు,

13. కుల ధృవీకరణ పత్రం,

14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు,

15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు,

16. అంగవైకల్యం సర్టిఫికేట్,

17. లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు,

18. పట్టదారు పాస్ బుక్

మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేవారు తమ ఓటరు స్లిప్‌ను పొందడంతో పాటు మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్ మ్యాప్ కూడా వచ్చే యాప్‌ను జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా రూపొందించింది.జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేవారు తమ ఓటరు స్లిప్‌ను పొందడంతోపాటు పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ సరికొత్త యాప్‌ను రూపొందించింది. ఇందులో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే మార్గాన్ని కూడా గూగుల్‌ మ్యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఓటరు స్లిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అవి అందనివారి సౌకర్యార్థం యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఎక్కువశాతం మంది స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నందున యాప్‌ ఉపయోగకరంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ద్వారా మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో నో-యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఆప్షన్‌లో క్లిక్‌ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్‌చేస్తే ఓటరు స్లిప్‌తోపాటు పోలింగ్‌ బూత్‌ ఎక్కడుందో గూగుల్‌ మ్యాప్‌ లొకేషన్‌ వస్తుంది. పేరుకు బదులుగా ఓటరు గుర్తింపుకార్డు నెంబర్‌, వార్డు పేరు ఎంటర్‌ చేసినా ఓటరు స్లిప్‌, పోలింగ్‌ కేంద్రం గూగుల్‌ మ్యాప్‌ వస్తుంది. ఈ నో-యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌ యాప్‌పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్‌ షెల్టర్లపైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఎఫ్‌ఎం రేడియోల్లో జింగిల్స్‌ ప్రసారం, టెలివిజన్‌ చానళ్లలో స్క్రోలింగ్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ యాప్‌పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్‌ ద్వారా సమాచారం అందిస్తున్నారు.