IGNOU పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. అసిస్టెంట్ రిజిస్టర్, సెక్యూరిటీ పోస్ట్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు INGOU తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు సూచించిన విధంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

పోస్టుల సంఖ్య:

Assistant Registrar: 21

Security Officer: 1

Assistant Registrar: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఏదైనా ఓ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు నవంబర్ 15 నాటికి 42 ఏళ్లు లేదా అంతకన్నా తక్కువ వయస్సు కలిగిన వారై ఉండాలి.

Security Officer (SO): ఏదైనా ఓ సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారై ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు సాధించన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు నవంబర్ 15 నాటికి 42 ఏళ్లు లేదా అంతకన్నా తక్కువ వయస్సు కలిగిన వారై ఉండాలి.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తేదీ: 15 నవంబర్, 2020.

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ: 10 డిసెంబర్ 2020.

పూర్తి వివరాలకు వెబ్ సైట్:  http://www.ignou.ac.in/