అక్రమ తవ్వకాలు వెంటనే ఆపేయాలి: అతికారి దినేష్

  • వైసీపీ ప్రభుత్వంపై ద్వజమెత్తిన రాజంపేట జనసేన సమన్వయకర్త అతికారి దినేష్

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట మండలం బాలరాజు పల్లె గ్రామంలో ఇసుక రీచులలో రోడ్డుల కోసం ఈ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు అక్రమంగా కొండలు తవ్విన గ్రావెల్ ను ఇసుక రీచుల కోసం రోడ్డు మార్గం ఏర్పాటు చేయడం ఆ విధంగా అక్రమ ఇసుకను దళారుల చేత అక్రమంగా రవాణా చేయించడం తగదని, ఆ విధంగా వైసీపీ పార్టీ నాయకులు అక్రమంగా కొండ తవ్వకాలు, అక్రమ ఇసుక రవాణా వంటి చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యకలాపాలు చూస్తూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా చూస్తూ ఊరుకోవడం శోచనీయం. ఒక సామాన్యుడికి ఒక ట్రాక్టర్ గ్రావెల్ కావాలన్నా ఇసుక తీసుకువెళ్లాలన్నా పలు షరతులు విధించి పలు కడిషన్‌లు పెట్టే ప్రభుత్వ అధికారులు ఈ వైసీపీ అరాచక శక్తులు చేస్తున్నటువంటి అక్రమాల పైన ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే ఈ వైసీపీ ప్రభుత్వంలో చట్టాలు బలహీనుడికి బలంగానూ, బలవంతుడికి బలహీనంగాను పని చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. దోచుకోవడం, దాచుకోవడమే పరామవధిగా సామాన్యుడిని ఈ వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని తక్షణమే ఈ అక్రమాలను ఆపాలని లేని పక్షంలో రోడ్డులెక్కి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంగిలి ఓబులేష్, గుగ్గిళ్ళ నాగార్జున, వెంకటేష్, గోపికృష్ణ, హేమంత్, ఆనంద్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.