జవ్వాజి రాంబాబుకు నివాళులర్పించిన ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, పొదిలి మండలం, కాటురివారిపాలెం గ్రామం నందు జనసేన కార్యకర్త జవ్వాజి రాంబాబు దశదిన కర్మ కాండ కార్యక్రమానికి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, సోము వెంకట్రావు, పగడాల ఆదినారాయణ, వెంకట నారాయణ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.