జనసైనికుడు చంద్ర మోహన్ కు నివాళులర్పించిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, పొదిలి మండలం, కాటువారిపాలెం గ్రామం నందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ జనసైనికుడు చింతలపూటి చంద్ర మోహన్ భౌతిక దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ ఐనగంటి శైలజ, జనసేన ఎన్.ఆర్.ఐ సోము వెంకట్రావు, జనసేన నాయకులు పేరూరి రమేష్, శిరిగిరి చలపతి, నరేంద్ర, నరహరి, వెంకటేశ్వర్లు గురవయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.