ఆమదాలవలస నియోజకవర్గ స్థాయి సమావేశం

ఆమదాలవలస నియోజకవర్గం యువశక్తి ప్రచారకర్త, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ నెల 12 న జనసేన పార్టీ నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువశక్తి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.