జనసేన పార్టీ వడమాలపేట మండలం కమిటీ కీలక సమావేశం

తిరుపతి: పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు వడమాలపేట మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ బూత్ లెవల్ కమిటీ మరియు మండల స్థాయిలో పార్టీ బలోపేతం చేయడానికి కార్యాచరణ చేయాలని సూచించారు. జనసేన పార్టీకి ఆకర్షితులై కొందరు యువకులు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గం ఇంచార్జీ మెరుపుల మహేష్ గారు, వడమాలపేట మండల అధ్యక్షుడు మునిశేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు హరి, పరుశురాం, కుమార్ మరియు శేషు జనసేన వడమాలపేట కార్యకర్తలు హాజరయ్యారు.