గాజువాక నియోజకవర్గంలో ఘనంగా మన ఊరు- మన ఆట

గాజువాక నియోజకవర్గం: 68వ వార్డ్ అధ్యక్షురాలు మాక షాలిని ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు 68వ వార్డ్ లో కాళికానగర్, గిరిప్రసాద్ కాలనీ, మరియు రాజీవ్ నగర్ కూడలిలో మన ఊరు, మన ఆట కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు మరియు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, తిప్పల రమణా రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్స్ నాగలక్ష్మి, కిరణ్ ప్రసాద్, త్రివేణి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు యువత, జనసైనికులు, వీరమహిళలు సామాన్య ప్రజలు పాల్గొనడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లంక లత, జ్యోతి రెడ్డి, రామలక్ష్మి, అరుణ కుమారి, అనురాధ, శంకరమ్మ, మల్లికా, గుర్రాల చిన్నా, మజ్జి సంతోష్, ప్రేమ్ కుమార్, కాదా నాయుడు, గొరిపుశెట్టి శ్రీను, పిండి అశోక్, అల్లాడి రవీంద్ర, మారడభూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.