మదనపల్లెలో జనంలోకి జనసేన పట్టణ బాట

మదనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డులో జనసేన పార్టీ గంగారపు రాందాస్ చౌదరి సమక్షంలో జనర్దన్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన పట్టణ బాట కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది. అనంతరం గంగారపు రాందాస్ చౌదరి సమక్షంలో జనసేన పార్టీ కార్యదర్శి జనార్దన్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో యువత కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్దాంతలను గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని జనసేన టీడీపీ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, నిజం గెలిచి చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని, ఈ అవినీతి అసమర్థ పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతాలానికి తొక్కేయడం గ్యారెంటీ అని తెలియచేసారు. రాష్ట్రం తలరాత మార్చాలన్నా రాజకీయ నాయకుడి తలరాత మార్చాలన్న ఓటు ముఖ్యమైనది కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకొని రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నేతృత్వంలో జనసేన-టీడీపీ పార్టీల విజయానికి ఓట్లువేసి వేయించి ఈ దుష్ట పాలనను అంతమోదిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, చంద్రశేఖర, రెడ్డెమ్మ, గడ్డం లక్ష్మిపతి, అర్జున, జవిలి మోహన్ కృష్ణ, నారాయణ స్వామి, లవన్న, విజయ్ కుమార్, పవన్, జంగాల గౌతమ్, జై శేఖర్, నగేష్, నరేష్, వినోద్ కుమార్, బండి చరణ్ తదితరులు పాల్గొన్నారు.