రాజానగరంలో వైఎస్సార్సీపీ నుండి జనసేనలోకి కొనసాగుతున్న చేరికలు

  • కాటవరం గ్రామంలో జనసేన తీర్థం పుచ్చుకున్న పలు బీసీ కుటుంబాల సభ్యులు
  • తీవ్రమైన ప్రజా వ్యతిరేకతో దూరమవుతున్న క్యాడర్, అయోమయంలో వైసీపీ శ్రేణులు
  • కథనోత్సవంతో కదులుతున్న బలరాముడి జనసైన్యం
  • రానున్న రోజుల్లో వైసిపి నుండి జనసేన లోకి మరిన్ని భారీ చేరికలు
  • ప్రజాచైతన్యమే లక్ష్యంగా.. అరాచక పాలనపై బలరాముడి అస్త్రం.. దోపిడీపై ధర్మ యుద్ధం..
  • రాజానగరం నియోజకవర్గంలో అత్యంత శక్తివంతమైన, ప్రజాకర్షణ నేతగా ప్రజల మన్నలతో బత్తుల బలరామకృష్ణ.. నియోజవర్గ ప్రజల చూపు అతని రాబోయే గెలుపు పైనే

రాజనగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, కాటవరం గ్రామంలో.. బీసీ కాలనీకి చెందిన పలు బీసీ కుటుంబాలు, ఇతరులు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు మరియు రాజకీయ లక్ష్యాలు అలానే రాజానగరం నియోజకవర్గంలో.. ఆత్మవిశ్వాసంతో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా.. మడమ తిప్పని పోరాటపటముతో.. జనసేన పార్టీ ఉన్నతికి అహర్నిశలు శ్రమిస్తూ.. తన సమర్థవంతమైన నాయకత్వంతో ప్రతి సామాన్యుడికి చేరువ అవుతూ.. ప్రజల కష్టాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ.. కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ… నేడు రాజానగరం నియోజకవర్గంలో అత్యంత శక్తివంతమైన, ప్రజా నాయకుడిగా ఎదుగుతున్న (ఎదిగిన) రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ జనసేన కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, రాబోవు రోజుల్లో జనసేన-టిడిపి పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించి, రాజానగరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి మంచి పరిపాలనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను తెలుసుకుని కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.