స్పందనలో జనసేన వినతి

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలం, కొడవలి గ్రామంలో స్థానికులు 40 ఈ సంవత్సరాల నుండి 370 ఎకరాల్లో కొండ పొడు వ్యవసాయం చేస్తున్న సర్వే నంబర్ 133/1 కొండ భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మలుచుకుని జీడిపంటను పండించుకుని జీవనాధారం పొందుతున్న వారిని ఆ భూమిని మైనింగ్ కి కేటాయించి వారికి అన్యాయం చేయొద్దని, వెంటనే మైనింగ్ అపి వారికి న్యాయం చెయ్యాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గత మంగళవారం (02/05/2023) నాడు డిమాండ్ చేస్తూ, వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా శుక్రవారం కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి ఆదేశాల మేరకు గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాదివల్లి రామకృష్ణ, మరియు గ్రామస్థులు కలెక్టర్ కి అర్జీ సమర్పించి, సమస్యను వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ దర్యాప్తు చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోపు సురేష్, నక్క శ్రీను (బద్రి), నక్క నారాయణమూర్తి, గొద్దటి లక్ష్మి నారాయణ, అంజి, శ్యామల, దొరబాబు, వంశీ, గంపాల రాంబాబు, నరాల సుబ్రహ్మణ్యం, నామా సాయిబాబు, కొడమంచిలి దుర్గాప్రసాద్, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.