శ్రీకాళహస్తిలో జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో గుంతల రోడ్లపై పడవలు వదిలి నిరసన

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో జనసేన-టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హాష్ టాగ్ #GunthalaRajyamAP #WhyAPHatesJagan పేరుతో ప్రచురించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సంవత్సరాలలో తట్టెడు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడుతాడా, కొత్త రోడ్లు వెయ్యలేదు, కనీసం గుంతలకి మట్టి కూడా వెయ్యలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గుంతలమయం అయిన రోడ్డులో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, ఐటీ కో-ఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు పేట చంద్ర శేఖర్, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, లక్ష్మి, దినేష్, కవిత, గురవయ్య, జ్యోతి రామ్, రాజేష్, సురేష్, జనసైనికులు శివ, హేమంత్, తులసీ రామ్, గోపి తదితరులు పాల్గొన్నారు.