నాదెండ్ల సమక్షంలో సాలూరు నియోజకవర్గ జనసేన పార్టీలో ముఖ్య నాయకుల చేరిక

పార్వతీపురం: అమరావతి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ అదాడ మోహన్ రావు రాజేంద్రప్రసాద్ (జల్లా లీగల్ సెల్ అడ్వైజర్) సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త రిశివర్ధన్ మెంటాడ మండల నాయకులు రాజశేఖర్ ల ఆధ్వర్యంలో గేదెల రామకృష్ణ జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వద్ద కండువా కప్పుకొని జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఎస్.టి నియోజకవర్గం అయిన సాలూరు తరుపున గదబ సామాజిక వర్గం నుండి పార్టీలో జాయిన్ అవ్వడంతో సంతోషకర పరిణామం అని అందరు కలిసికట్టుగా నియోజవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని మనోహర్ తెలియచేశారు. పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు కృషి చెయ్యాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవ్వ సంతోష్, పొట్ట శేకర్ తధితరులు పాల్గొన్నారు.