సంస్కారహీనులే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు: నందగిరి సతీష్

తెలంగాణా, కుత్బుల్లాపూర్, జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో, ఇతర సామాజిక మాధ్యమాలలో హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని కొంతమంది ఏపీ వైసిపి నీచులు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ, పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాలు, గ్రేటర్ అధ్యక్షులు రాధారం రాజలింగం సూచనల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ నందగిరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వారందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నందగిరి సతీష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అవినీతి వైసీపీ ప్రభుత్వం హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకొని కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మా అధినేత మీద విషం చిమ్ముతున్నారని, రాజకీయాలను పక్కనపెట్టి ఇలా వ్యక్తిగత జీవితాల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నరని, వారు ఎంతటి వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ఆ నీచులు ఇలాంటి మాటలు, దుష్ప్రచారం ఆపకపోతే కఠినమైన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, ఆ తర్వాత ఏం జరిగినా సరే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ వడ్లకొండ, దుర్గా ప్రసాద్, అడపా గణేష్, తనికంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.