ఆవులమంద గ్రామంలో టిడిపి, వైసిపి పార్టీల నుంచి జనసేన పార్టీలోకి భారీ చేరికలు

ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గంలోని, కురిచేడు మండలం, ఆవులమంద (కొత్తూరు) గ్రామంలో టిడిపి, వైసిపి పార్టీల నుంచి జనసేన పార్టీ లోకి చేరిన 50 కుటుంబాలు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు పార్టీ లోకి జనసేన కండువా కప్పి ఆహ్వానించిన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు. అనంతరం పార్టీ సిద్ధాంతాల గురించి వివరించిన వరికూటి నాగరాజు వారి చేత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపించడం జరిగినది.