టీమ్ పిడికిలి ప్రాజెక్ట్ 2 పోస్టర్ల ఆవిష్కరణ

గూడూరు: ఎన్.ఆర్.ఐ జనసేన నాయకుడురాజా మైలవరపు ఆధ్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందించి.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పంపిణీ చేయటానికి పంపిన ప్రాజెక్ట్ 2 (వాల్ పోస్టర్లు ) స్టిక్కర్లు శుక్రవారం కర్నూలు జిల్లా.. కోడుమూరు నియోజకవర్గంలో.. గూడూరు మండలం నగర పంచాయతీ జనసేన నాయకులు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. జనసేన పార్టీ లక్ష్యం అన్నం పెట్టే రైతన్న రాజు కావాలని.. పంటలకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలని కోరుకొనే పార్టీ జనసేన అని.. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు.. దురదృష్టవశాత్తు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు బాసటగా ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున అందిస్తున్న ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు. మే 8న ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ మండలం రచ్చబండ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 132 కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, ఆకెపోగు రాంబాబు, పసుల గజేంద్ర, ఎల్లప్ప, రాజు, మురళి, సుంకన్న జనసైనికులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగిందని తెలియజేశారు.