కువైట్ లో జనసేనలో యువత చేరిక

  • కువైట్ లో పవిత్ర ప్రార్థన మందిరం వేదికగా యువతని పార్టీలోకి ఆహ్వానం పలికిన జనసేన పార్టీ గల్ఫ్ కన్వీనర్ కంచన శ్రీకాంత్

కువైట్: కువైట్ లోని పర్వానియ ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు బుడుమూరి నాగార్జున, మట్ట జాషువ వాసు, సత్యడ వరప్రసాద్, తేనెటీ జాన్ శ్రీను, భాతిరెడ్డి భాను ప్రకాష్ మరియు 30 మందిని పార్టీ కండువా వేసి గల్ఫ్ జనసేన పార్టీ జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ వారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. యువతే దేశానికి పట్టుకొమ్మని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని, అవినీతి మచ్చలేని నాయకుడు పేదల అభిమాని సేవా తత్పరుడైన పవన్ కళ్యాణ్ గారిని రాబోయే ఎన్నికలలో గెలిపించుకోవలసిన అవసరం ప్రతి ఒక జనసైనికుని మీద ఉందని కువైట్ కన్వీనర్ బిరదా సూర్యనారాయణ గారు విజ్ఞప్తిచేశారు. ఇతర పార్టీలు విదిలించే డబ్బులకు ఆశపడకుండా మన ఓటు, మన బంధువులందరి ఓటును గాజు గ్లాస్ గుర్తు మీద వేయించే బాధ్యత మన అందరి మీద ఉందని కువైట్ కన్వీనర్ ఆకుల రాజేష్ తెలిపారు. పేద ప్రజల సంక్షేమం ప్రభుత్వం చేయవలసిన బాధ్యత, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తమ జేబులో నుంచి తీసి ఇచ్చినట్లు ప్రవర్తించడం చాలా విడ్డూరకరం, రాష్ట్ర ద్రవ్యోల్బణాన్ని అరికట్టే చర్యలు తీసుకోకుండా కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమంతో ప్రజలందరికీ మేలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన అవసరం ఎంతైనా ఉందని కో-కన్వీనర్ దండు చంద్రశేఖర్ కోరారు. ఈ సమావేశమునకు హాజరైన జనసైనికులు అందరిని కో-కన్వీనర్ యిమ్మిడిశేట్టి సూర్య ఆహ్వానం పలుకుతూ ఈ ఒక్కసారి మనమందరం మన ప్రాంతానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని, ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు బుడుమూరి నాగార్జున, మట్ట జాషువ వాసు, కో-కన్వీనర్ జిగిలి ఓబులేసు, పర్వానియా కోఆర్డినేటర్ పూల సాయి కిషోర్ మాట్లాడుతూ ఇంతవరకు మనం ఎంతో కోల్పోవడం జరిగింది, ఇక కోలుకోవడం మన వంతు అని జనసేన అభిమానులందరినీ ఉద్దేశిస్తూ, రాబోయే రోజుల్లో కువైట్ లో ఎంతోమందితో మమేకమై, గల్ఫ్ లో జనసైనికుల సత్తా ఏమిటో చూపించే సమయం ఆసన్నమైందని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ సభ్యులు కోల వెంకట మని శ్రీకాంత్, సోషల్ మీడియా సభ్యులు కొమ్మినేని బాలాజీ, యూత్ వింగ్ సభ్యులు చలపతి, మరియు రాజేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.