కర్నూల్ నగరంలో జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

స్థానిక కర్నూల్ నగరం నందు వెంకటరమణ కాలనీ నందు జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికారత చైర్పర్సన్, రాయలసీమ కమిటీ మెంబర్, ఎమ్మిగనూరు ఇంచార్జి రేఖగౌడ్, నాయకులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో జండా వందనం చేసి వారు మాట్లాడుతూ స్వేచ్ఛ స్వాతంత్య్రాలను అందించిన అమర వీరులకు పాదాభి వందనం.. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం కార‌ణంగా మ‌నం అందరం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాం. బ్రిటీషువారి బానిస సంకెళ్ళతో తమ జీవితాలతో పాటు ప్రాణాలను కూడా అర్పించిన ఎందరో మహనీయులను భారతావని తలుచుకుంటుంది. మన దేశానికి వచ్చి వందల సంవత్సరాలు మన మీద అధికారం చెలాయిస్తున్న తరుణంలో అప్పట్లో ప్రతీ ఇంటిలో ఉన్న యువతకు దేశ భక్తి పెంపొంధించేవారు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం ధన, మాన, ప్రాణ త్యాగం చేసిన యోధుల జీవితం ఎప్పటికీ చిరస్మరణీయమే.. వారి పోరాటాలు.. నేటి యువతకు మార్గదర్శకం.
యువతతో పాటు దేశ స్వరాజ్య స్థాపనకు ప్రతీ గ్రామం నుండి వయస్సు మళ్ళిన వృద్దుల దాకా ఈ స్వాతంత్య ఉద్యమంలో పాల్గొని బ్రిటీషు వారిని మన దేశం నుండి వెళ్ళగొట్టి దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చారు. అప్పటి త్యాగమూర్తుల స్వాతంత్ర్య ఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్చాయుత జీవితం. నేటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో దేశ యువత ఆ త్యాగమూర్తులను ఆదర్షంగా తీసుకుని యువత గుండెల్లో జాతీయ భావాలు కలిగిన స్ఫూర్తి నింపి నేటి భారతావని ఎప్పటికీ దగద్ధమానంగా వెలిగిపోవాలని ఆకాంక్షిస్తూ నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎందరో వీరుల త్యాగ ఫలం వారిచ్చిన అమూల్య‌మైన బ‌హుమ‌తిని గౌర‌వించ‌డం మ‌న క‌ర్త‌వ్యం.. భరతమాత ముద్దబిడ్డలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచ్చాయటం జరిగింది ఈ కార్యక్రమం నందు జనసేన పార్టీ వీరామహిళలు నాయకులు, జనాసైనికులు పాల్గొనటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *