వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు

కంబాలచెరువు, ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్ధానిక కంబాలచెరువు, చిరంజీవి పార్క్ దగ్గర నగర అధ్యక్షులు వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ జండా ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, నగర ఇంచార్చ్ అనుశ్రీ సత్యనారాయణ ఫాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా శాంతి కబూతం ఎగరవేయటం, మరియు మూడు వందల ముప్పై అడుగుల జాతీయ జండాతో భారీ ర్యాలీ పదర్శన చేయటం జరిగింది. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర్యం ఎంతో మంది త్యాగధనుల ఫలితమని, దేశం కోసం అమరులైన వీరుల వల్లే ఈ రోజు దేశ ప్రజలు స్వేఛా వాయువులు పిలుస్తున్నారని, భారతదేశం అన్ని మతాల కలయిక అని దుర్గేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు నగర కార్యవర్గ సభ్యులు, వీరమహిళలు, క్రియాశీలక సభ్యులు, జనసైనికులు భారీ సంఖ్యలో ఫాల్గొనటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *