ఇంగ్లండ్‌తో వన్డే ఫైట్‌కు సిద్దమవుతున్న భారత్..

టెస్ట్‌, టీ-20 సిరీస్‌ల్లో దుమ్మురేపిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే ఫైట్‌కు రెడీ అయింది. పుణేలో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. ఇవాళ తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్‌ను గెలవడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేందుకు కోహ్లీ సేన ఎదురుచూస్తుండగా.. రెండు సిరీస్‌ల్లో ఓడిపోయిన ఇంగ్లండ్‌.. వన్డే కప్పునైనా దక్కించుకోవాలన్న కసితో ఉంది.

టెస్ట్‌, టీ-20 సిరీస్‌ల్లో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన కోహ్లీ సేన.. ఇక వన్డే సిరీస్‌నూ చేజిక్కించుకునేందుకు సిద్ధమైంది. టీ-20 సిరీస్‌లో మెరిసిన సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు మరికొందరికి వన్డే సిరీస్‌కు అవకాశం దక్కగా.. పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. కోహ్లీ సేన. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నా.. రోహిత్‌ శర్మ ఫుల్‌ ఫామ్‌లో ఉండటం.. కెప్టెన్‌ కోహ్లీ కూడా జోరు మీద ఉండటం.. భారత్‌కు కలిసొచ్చే అంశాలు. టీ-20 సిరీస్‌లో KL రాహుల్‌ దారుణంగా విఫలం కావడంతో.. అతని స్థానంలో రిషభ్‌ పంత్‌ను ఆడించే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యతో పాటూ రిషబ్‌పంత్‌ కూడా కీలకమే కావడంతో… ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌, శ్రేయస్‌ అయ్యర్‌లో ఎవరో ఒకరికే చోటు దక్కవచ్చనే అంచనాలున్నాయి.

ఇక T-20 సిరీస్‌లో 12 వికెట్లు తీసిన భువనేశ్వర్‌ కుమార్‌, శార్దూల్‌ ఠాకూర్‌తో పాటు యార్కర్స్‌ స్పెషలిస్ట్‌ నటరాజన్‌, కొత్త ఆటగాడు ప్రసిధ్‌ కృష్ణ కూడా బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌, చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ కూడా తుది జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. అయితే హార్డిక్‌ పాండ్యా ఐదో బౌలర్‌గా అందుబాటులో ఉండటంతో.. మిగతా 8 మంది బౌలర్లలో ఎవరు తుది జట్టులో ఉంటారన్నది ఉత్కంఠగా మారింది. స్పాట్..

ఇక… టెస్ట్‌, T-20 సిరీస్‌ల్లో దారుణంగా ఓడిపోయిన ఇంగ్లండ్‌.. వన్డే సిరీస్‌ను అయినా గెలిచి స్వదేశానికి వెళ్లి పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లో బట్లర్‌, జేసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేయగల సమర్థులే. ఇక ఫాస్ట్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌, క్రిస్‌ జోర్డాన్‌, సామ్‌ కరన్‌.. టీ-20ల్లో భారత బ్యాట్స్‌మెన్‌ను బాగానే ఇబ్బంది పెట్టారు. అదే ఊపును వన్డే సిరీస్‌లోనూ కంటిన్యూ చేయాలన్న కసితో ఉన్నారు. వారితో పాటు స్పిన్నర్లు మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీ కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. స్పాట్..

మరోవైపు.. వన్డే సిరీస్‌లోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోతే.. ఎన్నో రికార్డులు బద్దలు అవుతాయని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. కోహ్లీ మరో సెంచరీ చేస్తే.. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ సరసన చేరతాడు. అంతేకాదు.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా కోహ్లీ కొత్త రికార్డ్‌ సృష్టిస్తాడు. ప్రస్తుతం వన్డేల్లో 41 సెంచరీలతో రికీ పాంటింగ్‌, కోహ్లీ సమానంగా ఉన్నారు. స్పిన్నర్‌ చాహల్‌ మరో వికెట్లు తీస్తే… వన్డేల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరతాడు. ఇక సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను వరుసగా ఐదు వన్డే సిరీస్‌ల్లో ఓడించింది… టీమిండియా. ఆరో సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని రిపీట్‌ చేయాలన్న పట్టుదలతో ఉంది.