గాల్వన్ అమరవీరులకు నివాళి అర్పించిన ఇండియన్ ఆర్మీ

గత ఏడాది జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన విషయం తెలిసిందే. గాల్వన్ ఘర్షణకు నేటితో ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ లేహ్‌లో గాల్వన్ హీరోలకు నివాళి అర్పించారు. భారతీయ సైన్యానికి చెందిన నార్తర్న్ కమాండ్‌లోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ నివాళులు అర్పించింది. మేజర్ జనరల్ ఆకాశ్ కౌశిక్ .. లేహ్‌లో ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పాలతో నివాళి అర్పించారు. గాల్వన్ దాడిలో అమరులైన భారతీయ సైనికులకు టాటా సంస్థ చైర్మన్ రతన్ టాటా కూడా నివాళి అర్పించారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఆయన ఇండియన్ ఆర్మీ నివాళి ఫోటోలను ట్యాగ్ చేశారు.