భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: ఆకుల సుమన్

హనుమకొండ, ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. ప్రతి పౌరుడినీ కార్యోన్ముఖులను చేయడానికి ఈ ఉత్సవాలు ఉపయోగపడతాయి. తాము రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటున్నామా? లేదా? అనే విషయాన్ని సమీక్షించుకోవాలి అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ అన్నారు, ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఈ రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్ర కీలకం ప్రతి మహిళకూ ఓటు వేసే హక్కును కల్పించింది రాజ్యాంగం, దీనితోపాటు చట్టసభలో అడుగు పెట్టే అవకాశాన్నీ కల్పించింది. శ్రీ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో శ్రమించారు. తన జీవితాన్ని ధారపోశారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టపడి ఎలా చదువుకున్నారో, ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. అందువల్ల ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను నవంబర్ 26న విద్యార్ధులు, ప్రజలకు తెలిసేలా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి అని పేర్కొన్నారు.