సిజి రాజశేఖర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

పత్తికొండ నియోజకవర్గం, మద్దికేర మండలం నాయకులు, గద్దల రాజు, అశోక్, గద్దల అజయ్, కంబగిరి, లవన్న, ఆధ్వర్యంలో పత్తికొండ జనసేన నాయకులు సిజి రాజశేఖర్ సమక్షంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి 20 మంది బీసీ ఎస్సీ కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. అనంతరం సిజి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ఓసి కులాలకు సంబంధించిన సల్మాన్, వెంకటరామిరెడ్డి, మహబూబ్ బాషా, సి.మద్దన్న, ఎస్.హరికృష్ణ, నరేష్, ఎండే రాము, గోపి, భరత్, అనుమేష్, లవన్న, వంశి, కాశిం, రామచంద్ర, ఉదయ్ మహేష్, శంకర్, వెంకట్, రామంజి, మరియు తదితరులు సోదరులు పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం, రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో ఎదుగుదలను కొరకు బడుగు బలహీన వర్గాలను పల్లకిలో ఎక్కించడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని తెలియజేశారు. పత్తికొండ నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి జనసేన పార్టీతోనే సాధ్యమవుతుంది, వైఎస్ఆర్సిపి పార్టీలో అభివృద్ధి శూన్యం, పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, అధికారంలోకొస్తే కనుక బడుగు, బలహీన వర్గాలకు జనసేన పార్టీలో కీలక పదవులు కూడా ఆయా వర్గాలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జనసేన పార్టీ ఆవిర్భవ సభకు స్థలం ఇప్పటం గ్రామస్తులు ఇచ్చినందుకు, ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని, అభివృద్ధి పేరుతో ఇళ్లను కూల్చి ప్రజలపై కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేయడానికి స్థిరపడింది కానీ కోర్టు తీర్పుతో ప్రజలకు న్యాయం జరిగిందని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం డ్రామాలు ఇప్పటికైనా ఆపాలని చేస్తుందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేయాలంటే జగన్ రెడ్డి, మా పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ టౌన్ నందు రోడ్డు వెడల్పు చేపట్టాలని గత 30 సంవత్సరాలు నుంచి ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న అదిగో ఇదిగో అంటూ కొలతలతో కాలక్షేపం చేస్తూ, ఉన్నారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా పత్తికొండ నియోజకవర్గంలో రోడ్డు వెడల్ కార్యక్రమంలో వెంటనే చేపట్టాలని ఈ జగన్ రెడ్డిని కోరుచున్నాము, నిజంగా ట్రాఫిక్ సమస్య ఉన్నచోట వదిలేసి ఇప్పటం ప్రజలపై కక్ష సాధింపు తప్ప వేరే ఆలోచన లేదన్నారు, మా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు రోడ్డు వెడల్పు చేపడతామని పూజ కార్యక్రమాలు చేసి ఇప్పటివరకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టలేదు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టాలంటే మొట్టమొదటిగా పత్తికొండ నియోజకవర్గం రోడ్డు వెడల్పు చేపట్టాలని కోరుచున్నాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలే లేకుండా అణచివేతకు గురి చేస్తున్నా పవన్ కళ్యాణ్ ధైర్యంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలలో రాజ్యాధికారమే దిశగా పనిచేస్తున్నారని అలాంటి నిజాయితీగల జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక సామాన్య వ్యక్తి నిజమైన మార్పు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని తెలియజేశారు. జనసేన పార్టీలో ఏ జనసైనికుడు కూడా మందు బిర్యానీ, ప్యాకెట్లకు ఆశించి పని చేసే వాళ్ళు ఎవరూ లేరని జనసేనలో ఉన్నది కరుడుగట్టిన నిస్వార్థపు, గుండెల నిండా ధైర్యం కలిగిన జనసైనికులు ఉన్నారని తెలియజేశారు. అధికార పార్టీ నాయకులు ఎవరు ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా జనసైనికులు భయపడే ప్రసక్తే లేదని ఎవరికి ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి మీకు అండగా మేము ఉంటామని తెలియజేశారు 2024లో పత్తికొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలవడమే మా ప్రధాన లక్ష్యమని కలిసికట్టుగా ఇప్పటి వరకు అనేక గ్రామాలలో పర్యటించాం, సమస్యలపై పోరాడుతున్నాం, ప్రతి సామాన్యుడు జనసేన పార్టీ అధికారం రావాలని కోరుకుంటున్నారు. ప్రధాన సమస్యలపై పోరాడుతున్నాం, ఎన్నో సమస్యలు పరిష్కరించాం, ప్రజలకు మరింత దగ్గర అవుతున్నాం, కావున ఇంకా మనమంతా ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్దామని ప్రతి ఒక్కరు మీ గ్రామాలలో మీ వార్డులలో సమస్యలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, వాటీ మీద పోరాడుదాం ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ నిలిచిపోయేలా మనమంతా కలిసి పోరాడుదాం, విజయం సాధిద్దాం అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.