శ్రీకాంత్ రెడ్డి ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ల పరిశీలన

తాడిపత్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆద్వర్యంలో నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న జగనన్న ఇళ్లు పేదలందరికీ కనీళ్లు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 2 రోజుల నుంచి టిడ్కో ఇళ్లు, మరియు జగనన్న కాలనీలో పర్యటించి ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, స్థానిక మీడియా ద్వారా సమాచారం ఇచ్చామని ఇందులో భాగంగా 14వ తేదీన సోషల్ ఆడిట్ ని తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో మరియు పెద్దవడుగురు మండల కార్యాలయంలో అర్జీలు ఇచ్చి టిడ్కో ఇళ్లు మరియు జగనన్న కాలనీలకు సంబంధించి ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన విధివిధానాలు ఏంటని వాటి వివరాలూ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు హర్షద్అయుబ్, ప్రధాన కార్యదర్శి కొండాశివ, రసూల్, రాహూల్ తదితరులు పాల్గొన్నారు.