మైలవరం జనసేన ఆద్వర్యంలో “జగనన్న మోసం” డిజిటల్ క్యాంపెయిన్

మైలవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు ఈ నెల 12,13,14 తేదీలలో రాష్ట్రం మొత్తం జరిగే జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రెడ్డిగూడెం మండల అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు ఆధ్వర్యంలో స్థానిక రెడ్డిగూడెంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం పంచాయితీ ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను సందర్శించి ఆ ఇళ్ల స్థలాల గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల నాయకులు పాములపాటి సుందరరామిరెడ్డి మరియు, చాపలమడుగు కాంతారావు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ప్రచారంలో వైసీపీ వాళ్ళు నవ రత్నాలలో ఒకటైన జగనన్న ఇళ్లు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటిలో ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం స్తాపించి మూడున్నారేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు రాష్ట్రం మొత్తంలో కనీసం పది శాతం కూడా ఇళ్లు పూర్తికాలేదని అంతే కాకుండా ముందు ఇళ్ళస్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామన్నారు. తరువాత ఇళ్ల స్థలం ఇచ్చాము మీరే ఇళ్ళు కట్టుకోండి మేము బిల్లు ఇస్తాము అన్నారు. ఇప్పుడైతే మీరు ఇళ్లు మొదలు పెట్టకపోతే స్థలం వేరేవాళ్లకు ఇచ్ఛేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంకా చెప్పాల్సి వస్తే రెడ్డిగూడెం మండలం మొత్తంలో ఏ గ్రామంలో కూడా జగనన్న కాలనీల్లొ పనులు మొదలుపెట్టలేదు ఒక్క పెట్టిన పాపాన కూడా పోలేదు అన్నారు. దీనికి కారణం మైలవరం నియోజకవర్గ యం.యల్.ఏ వసంత వసంత కృష్ణప్రసాద్ రెడ్డిగూడెం మండలం మీద కక్షకట్టారాని కక్ష కట్టకపోతే నియోజకవర్గం లోని మిగతా నాలుగు మండలాలలో ఎంతో కొంత పనులు జరుగుతున్నాయి కేవలం రెడ్డిగూడెం మండలం లోనే ఎలాంటి పనులు మొదలు కాలేదని దీనికి వసంత కృష్ణప్రసాదేనని అన్నారు. నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన రెడ్డిగూడెం మండలం ప్రజలు ఏం పాపం చేశారని ఇలా కక్షసాదిస్తున్నారని దీనికి సమాధానం చెప్పలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూనపరాజుపర్వ,ఓబుళాపురం గ్రామాలలో ఇచ్చిన ఇళ్ల ప్లాట్లను సందర్శించారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇళ్ల స్థలాలు ఊరికి దగ్గర ఇవ్వలేదని ఊరికి దూరంగా గత్లల్లొ పుట్లల్లో ఇచ్చారు. రెడ్సిగూడెం పంచాయితీ ప్రజలకైతే మరీ దారుణమని ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఇంత దూరం వఛ్చి ప్రజలు ఎలావుంటారని ప్రశ్నించారు. మేము కోరుకున్నా, మా పార్టీ నాయకులు కోరుకున్నా, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ కోరుకున్నా అది ప్రజలకు మంచి జరగడమే అన్నారు. ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో హామీలిచ్చి ఇప్పుడు అవి నెరవేర్చకుండా ఉండడం సరికాదని వెంటనే కాలనీలలో నిర్మాణ పనులు మెదలుపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బొల్లిపోగు చంటి, కమిటీ సభ్యులు రామ్ ప్రసాద్, దుర్గాప్రసాద్, గంగాదర్, క్రాంతిబాబు, అనంత్ కుమార్, గోపి, సాంబశివరావు, రమేష్, సుభాని, రామకృష్ణ, శివ మరియు జనసైనికులు శుభాస్, సురేష్, ప్రవీణ్, అశోక్, సునీల్, భరత్, రాము, వేణు తదితరులు పాల్గొన్నారు.