తాడిపత్రి జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

తాడిపత్రి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు కార్యక్రమాన్ని ఆదివారం యాడికి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు మండలాలలో చేపట్టడం జరిగింది. మొదట యాడికి మండలంలోని చందన రోడ్డు, పిన్నేపల్లి రోడ్డు, గుడిపాడు, నిట్టూరు మరియు రాయల చెరువు గ్రామాలలోని జగనన్న ఇళ్లకు కేటాయించిన స్థలాలను తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి గారు యాడికి మండల అధ్యక్షులు సునీల్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కదిరి శ్రీకాంత్ రెడ్డి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు, ఇళ్ల స్థలాలను పరిశీలించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడ కూడా ఇల్లు నిర్మాణాలకు నోచుకోలేదని దీన్నిబట్టి చూస్తే పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు అదేవిధంగా ఇళ్లకు కేటాయించిన భూములు ముళ్ళ చెట్లతో మరియు పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా ఉండటంవల్ల కొన్ని లక్షలు విలువచేసే భూములు వృధా అయ్యాయని తెలిపారు. మండల ఇంచార్జ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని 14 పంచాయతీలకు గాను కేవలం 9 పంచాయతీల్లోనే స్థలాలు కేటాయించారు అన్నారు ఇళ్ల స్థలాలకు సంబంధించి అధికారులను వివరాలను కోరగా యాడికి మండలంలో ఇళ్ల నిర్మాణాలు ఇంకా మొదలు పెట్టలేదని రెండవ దశలో వీటిని నిర్మాణం చేపడుతామని తెలిపారని ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అవుతుంది ఎన్నికలలో రావడానికి ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉందని మొదటి దశ ఇల్లే ప్రారంభం కాకపోతే రెండవ దశ ఇల్లు ఎప్పుడు ప్రారంభమైతాయని మండిపడ్డారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలియజేయడం కోసమే జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ అవినీతిపై ప్రభుత్వం స్పందించకపోతే పూర్తిస్థాయిలో ఉద్యమాలు చేపడతామని తెలిపారు. పెద్దవడుగూరు మండలంలోని గుత్తి రోడ్డులో మరియు పెద్దపప్పూరు మండలంలోని జగనన్న ఇళ్లకు కేటాయించిన స్థలాలను నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మరియు మండలానికి సంబంధించిన కార్యకర్తలు దూద్ వలి, రాజేంద్ర, వేణు, బాబా, రాజు, రంగా, రాజేష్, మహేశ్వర్ రెడ్డి, వెంకటేష్ తో కలిసి పరిశీలించారు, స్థలాలన్నీ కూడా ఎటువంటి నిర్మాణం లేకుండా కంపచెట్లతో ఉండటం చూసి నియోజకవర్గంలో ఏ మండలానికి వెళ్లిన ఇదే పరిస్థితి ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే జగనన్న ఇళ్లకు సంబంధించి చర్యలు చేపట్టాలని అధికారులకు వినతి పత్రాల ద్వారా నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షులు నరసింహచారి, ఉపాధ్యక్షులు హర్షద్ అయుబ్, ప్రధాన కార్యదర్శులు కొండాశివ, మణికంఠ, రసూల్, యాడికి మండల ఉపాధ్యక్షులు జాకీర్ హుస్సేన్, ముఖ్య నాయకులు దస్తగిరి, నరేష్, నాగర్జున, మహేంద్ర, రాజశేఖర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.