జనసేనాని స్పూర్తితో భోగిరెడ్డి కొండబాబు లక్ష విరాళం

కాకినాడ రూరల్, రైతులకు అండగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఐదు కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇంచార్జి పంతం నానాజీ ఆధ్వర్యంలో రైతులను ఆదుకునే విధంగా తన వంతు బాధ్యతగా జనసేన పార్టీకి 1 లక్ష రూపాయలు ప్రకటించిన కరప మండల జడ్పిటిసి గా పోటీ చేసిన సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు. ప్రతి నెలా జరిగే తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశంలో 1 లక్ష రూపాయలు ప్రకటించారు.