రైతులు చెల్లించే సాగునీళ్ల పన్ను పై వడ్డీ ఎత్తివేయ్యాలి: జనసేన

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ రాష్ట్ర ప్రభుత్వం రైతులు నెత్తిమీద మరో పిడుగు వేసింది, 2018 నుండి ఉన్న సాగునీళ్ల పన్ను పెండింగ్ ఉంటే దానిపైన 6% వడ్డీ కలిపి చెల్లించాలనీ, ఒకవేళ చెల్లించకపోతే రైతు భరోసా ఆపివేస్తామని, పంటలు నష్ట పరిహారం ఆపివేస్తామని రైతులను బెదిరించటం మొదలు పెట్టింది. చాలా సిగ్గుచేటయిన ఈ విషయాన్ని.. ఈ ప్రభుత్వ విధానాన్ని జనసేన పార్టీ ఖండిస్తుందని కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు తెలియ జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులకు అండగావుండే ప్రభుత్వం అని చెప్పుకొనే మీరు రైతులు వద్ద నుండి 6% వడ్డీ వసూలు చేయేటం బాధాకరం. మీ ప్రభుత్వం వడ్డీ వ్యాపారం చేస్తుందా..? పాలనా చేస్తుందా..? పరిపాలన చేతకాక, పరిపాలన చెయ్యలేక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని విమర్శలు చేస్తూ కాలం గడుపుచున్నారు. ఇప్పటికే ప్రజలు మిమ్ములను సిబిఐ దత్తపుత్రులు, ప్రశాంత్ కిశోర్ దత్తపుత్రులు అంటున్నారు. ఇక పొతే అవనిగడ్డ నియోజకవర్గంలో కాలవలు పరిస్థితి అందరికి తెలిసిందే, డెల్టా ఆధునీకరణ పేరుతో అవనితీపనులు చేసి, కాలవ లెవిలింగు లేకుండా పనులు చేసి రైతులు పొలాల్లోకి సాగునీరు రాకుండా చేసినారు గత ప్రభుత్వం. ఇప్పటి ప్రభుత్వం కాలవలు బాగుచేయించాలి అనే ఆలోచన కూడా లేదు. అవనిగడ్డ నియోజకవర్గంలో కాలవల ద్వారా నీళ్లు వస్తున్నా చమురు యంత్రాలుతో నీళ్లు పెట్టుకుని సాగుచేసుకొనే పరిస్థితి. ప్రస్తుతం డీజీల్ రేట్లు పెరిగి, పండించిన పంటకు సరిఅయిన గిట్టుబాటు దరలేక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని వ్యవసాయం చెయ్యలేని పరిస్థితిలో రైతుఅన్నలు ఉన్నారు. పండించిన పంట రైతు భరోసా కేంద్రాలకు వేస్తె 3,4 నెలలకు కూడా డబ్బులు చెల్లించటం లేదు. ప్రభుత్వం రైతులకు చెల్లించ వలసిన డబ్బు మీద 6% వడ్డీ కలిపి చెల్లిస్తారా అనీ అడుగుతున్నాము? అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఈ ప్రభుత్వం చుక్కలు భూములు సమస్య పరిస్కారం చెయ్యలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకూ సూయాజ్ గేట్లు (ఆటోమెటిక్ )బాగుచేయించ లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతిపక్షములో ఉండి పోరాటం చేసినారు, అధికారంలోకి వచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అనటం, ప్రతిపక్షాలను హేళనగా మాటలాడటం తప్ప రైతులు కోసం ఏమి చేస్తున్నారు..? నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి చెపుతున్నాము సిబిఐ దత్తపుత్రుడుకి చెప్పి రైతులు చెల్లించే నీళ్ళ పన్నుపై 6% కలిపి కట్టించుకొనే విషయం విరమించుకోవాలి అని చెప్పగలరు. నియోజకవర్గంలో ప్రతి ఎకరం చమురు యంత్రాలు లేకుండా కాలవ నీళ్లుతో రైతులు సాగుచేసుకొనే విధంగా అవకాశం కల్పించండి. నీటి పన్నుపై వడ్డీ వసూలు నిర్ణయం ప్రభుత్వం వెనక్కు తీసుకోక పొతే రైతులతో కలిసి ప్రజా ఉద్యమం చేస్తాం అని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరుపున రాయపూడి వేణుగోపాల్ రావు హెచ్చరించారు.