శ్రీ లక్ష్మీ గణపతి పట్టాభిరామ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానము

*నాదెండ్ల మనోహర్ గారికి, కొణిదెల నాగబాబు గారికి మరియు షేక్ రియాజ్ గారికి స్వాగతం.. సుస్వాగతం
*మొట్టమొదటిసారిగా పొన్నలూరు మండలంలో అడుగుపెడుతున్న అతిరథమహారధులు అందరికీ స్వాగతం.. సుస్వాగతం
*మేడా రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహణ
*జనసేన నాయకుల సమక్షంలో.. పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ పుట్టినరోజు వేడుకల నిర్వహణ

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో.. లింగోరిగుంట గ్రామంలో “శ్రీ లక్ష్మీ గణపతి పట్టాభిరామ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం” కార్యక్రమం జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి మరియు కొండేపి నియోజకవర్గం నాయకులు మేడా రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 10-06-2022న అనగా శుక్రవారం రోజున నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, మరియు రాష్ట్ర నాయకులు పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబుగారు మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు రావడం జరుగుతుంది. అదే రోజున పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాము.