జనసేన పార్టీ ముదినేపల్లి మండల కమిటీ నియామకం

*జనసేన మండల శాఖా నూతన కార్యవర్గం నియామకం

ముదినేపల్లి: జనసేన పార్టీ ముదినేపల్లి మండల కమిటీలో బుధవారం జనసేన మండల శాఖ నూతన కార్యవర్గం నియామకం జిల్లా అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడుగా వీరంకి వెంకటేశ్వర రావు (వెంకయ్య)ను కొనసాగించగా.. ఉప-అధ్యక్షులుగా వర్రే హనుమాన్ ప్రసాద్, ఎర్రంశెట్టి శివ ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా భూపాల నాని, దాసరి నగవీరంగానేయులు, చింతా మురళి కృష్ణ, అబ్బిశెట్టి నగేష్ బాబుతో పాటు మరో 6 కార్యదర్శులు, 9 మంది సంయుక్త కార్యదర్శులుగా బంద్రెడ్డి రామకృష్ణ నియమించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పురి నానాజీ మాట్లాడుతూ.. ముదినేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు గా ఎంపికైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. ఇప్పటినుండి మండల కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు.. చాలా బాధ్యతగా పార్టీని ముందుకు తీసుకు వెళ్ళాలి అని కోరారు.