‘పుష్ప’ రావడం మరింత ఆలస్యం?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వర్షాలు భారీగా పడుతూ ఉండటంతో, షూటింగుకు అంతరాయం కలిగిందట.

వర్షాలు తగ్గితేనే పాట చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. ఈ పాట కాకుండా మరో పాటతో పాటు, కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా చిత్రీకరించవలసి ఉంది. అందువలన ముందుగా అనుకున్నట్టుగా, ఈ నెల చివరికి ఈ సినిమా షూటింగు పూర్తికావడం లేదట. ఈ కారణంగా ‘క్రిస్మస్’కి ఈ సినిమా రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

అడవి నేపథ్యంలో నడిచే ఈ కథ .. అనూహ్యమైన మలుపులతో ఆసక్తికరంగా ఉండనుంది. ప్రతి పాటా .. ప్రతి ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. బోట్ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.