ప్రజల సౌకర్యార్థం సదుపాయాలు ఏర్పాటు చేయడం తప్పా..?: మలగా రమేష్

ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 38డివిజన్ సచివాలయంలో గత కొన్ని నెలలు తరపడి ఫ్యాన్ లు మంచి నీరు సదుపాయం లేక సచివాలయంకి వస్తున్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇది గమనించిన 38డివిజన్ జనసేనపార్టీ కార్పొరేటర్ మలగా రమేష్ తన సొంత నిధులతో ఫ్యాన్ లు మంచినీటి సదుపాయం ఏర్పాటు చెయ్యడం జరిగింది. కాని అది చూసి ఓర్వలేని అధికార పార్టీ నాయకులు, సచివాలయంలోని కొంతమంది సిబ్బందితో కలిసి కార్పొరేటర్ మలగా రమేష్ అందించిన ఫ్యాన్ లను తిరిగి పంపించారు. మంచి నీటి సదుపాయం నిలిపివేయడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ ప్రజలు అవాక్కయ్యారు. ప్రజా ఇబ్బందులు గుర్తించి సచివాలయంలో సదుపాయాలు ఏర్పాటు చేయడం తప్పా….? అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల తీరు ను, కొంతమంది సచివాలయ సిబ్బంది తీరును డివిజన్ ప్రజల తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ సందర్బంగా మలగా రమేష్ మాట్లాడుతూ సచివాలయంలో సరైన ఏర్పాటులు లేక సచివాలయం కి వస్తున్న ప్రజలకు, మహిళలకు, పసిబిడ్డలకు ఊపిరి కూడా ఆడకుండా అవస్థలు పడుతూ ఆరుబైట ఎండలో కూర్చునే పరిస్థితి ఉంటే సరైన ఏర్పాట్లు చెయ్యకపోగా ప్రజలపై కూడా రాజకీయ కక్ష సాధింపులకు గురిచేస్తుందే కాక ప్రజల సౌకర్యాలు కోసం మా సొంత నిధులతో ఏర్పాటు చేస్తే.. అదికూడా ఓర్వలేని కొంతమంది ఈ వైసీపీ నాయకులు వాటిని తిరిగి పంపించారు. ఇంతకంటే హెయమైన చర్యలు ఇంకేమి ఉంటుంది అని ప్రజల కష్టాలు ఈ వైసీపీ ప్రభుత్వానికి పట్టదా అని 38వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ మలగా రమేష్ వైసీపీ నేతలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు లాగా సచివాలయంలో కొంతమంది సిబ్బంది వాళ్లకి వత్తాసు పలకడం సిగ్గుచేటు. సచివాలయంలో జరిగే కొన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా తమను ఆహ్వానించకపోవడం హేమమైన చర్య. ఈ విషయాలన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని కార్పొరేటర్ రమేష్ స్పష్టం చేశారు.