‘విరూపాక్ష’ పట్టాలు తప్పనుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తిచేయడానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది. అయితే కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు వకీల్ సాబ్ సినిమా కూడా నిలిచిపోయింది. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కాకుండానే పవన్ కళ్యాణ్ తన తర్వాత ప్రాజెక్ట్ లను కూడా ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో వకీల్ సాబ్ టీం మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ కి వరుసగా రెడీ కానున్నాయి. అయితే మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుండడంతో ఆ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగoగా జరుగుతున్నాయి. అంతే కాకుండా డైరెక్టర్ క్రిష్ తో ‘విరూపాక్ష’ వెంటనే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలు వస్తాయని అందరూ ఎంతో ఆశతో వేచి చూస్తున్నారు. అయితే ప్రస్తుత కారణాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత భారీ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.

అయితే మొదటగా పవన్ వకీల్ సాబ్ షూట్ పూర్తి చేయాలని అనుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వకీల్ సాబ్ పూర్తి చేయడానికి సిబ్బంది పెద్దగా అవసరం ఉండదంట. పవన్ కూడా ఈ చిత్రాన్ని కేవలం 15 రోజుల్లోనే పూర్తి చేయనున్నాడట. ఆ తర్వాత ప్రాజెక్ట్ క్రిష్ సినిమా మొదలు పెట్టాలి అయితే ఆ సినిమాను ఆపేసి  దానికంటే ముందుగా హరీష్ శంకర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత దర్శక నిర్మాతలు కాస్త సందిగ్ధంలో పడ్డారట. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం క్రిష్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించట్లేదని సమాచారం. క్రిష్ సినిమా చిత్రీకరణకు వందలాది మంది సిబ్బంది అవసరం ఉంటుంది దేనికి కారణం క్రిష్ సినిమా చారిత్రక నేపథ్యంలో సాగుతుండడం. అందుకే దర్శక నిర్మాతలు క్రిష్ ఎఎం. రత్నం ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ పై ఇప్పటి వరకు ఎలాంటి ఒత్తిడి చేయలేదట. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం విరూపాక్ష ప్రాజెక్ట్ గురించి ఇపుడు ఏమి ఆలోచించడం లేదని, మరో ఆరు నెలలు గడిస్తే గాని ఏమి చెప్పలేమని అన్నాడట. అయితే పవన్ ప్రాజెక్ట్ మొదలయ్యేలోపు క్రిష్ మరో సినిమాను చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఏం జరగనుందో వేచి చూద్దాం.