చెత్తపన్ను కట్టడానికి, నెలవారీ జీతాలు చెల్లించటానికి ఏమైనా సంబంధం ఉందా?: నిమ్మకాయల రాము

జనసేన ఉమ్మడి అనంతపురం జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము మాట్లాడుతూ చెత్తపన్ను కట్టటానికి, నెలవారీ జీతాలు చెల్లించటానికి ఏమైనా సంబంధం ఉందా?.. అని ప్రశ్నించారు. చెత్త పన్ను కట్టటం అనేది పౌరుల భాథ్యత. నెలవారీ జీతాలు చెల్లించటం అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన విథి. లేక పోతే అర్థిక స్థిరత్వం కోల్పోయినట్లు లెక్క.!!

చెత్త పన్ను ఎప్పటికప్పుడు వెంటనే కట్టాలని అడగటం ఏమిటి? అసలు మీకు ఏమాత్రం బుథ్థి జ్ఞానం ఉన్నాయా.. ఇక్కడ మరోక దిక్కుమాలిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగులు ప్రభుత్వానికి పూర్తిగా బానిసలుగా మారిపోయారు. అందుకే వారికి ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది. కాకపోతే ఒక సామాన్య పౌరుడిగా నా అభిప్రాయం నిక్కచ్చిగా చెబుతున్నాని నిమ్మకాయల రాము ప్రబుత్వంపై మండిపడ్డారు.