నిమ్మలపాడు కాల్ సైట్ మైనింగ్ లీజ్ ను రద్దు చేయండి

*నిమ్మలపాడు కాల్ సైట్ మైనింగ్ లీజ్ ను రద్దు చేయకపోతే ప్రజా పోరాటం చేస్తాం: నవీన్ కుమార్ హెచ్చరిక

మండలంలో వాలాసి పంచాయితీ నిమ్మలపాడు, కరకవలస గ్రామాల మధ్య నిక్షితమైన కాల్ సైట్ మైనింగ్ వెలికి తీతకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మైదాన ప్రాంతమైన గిరిజనేతరులకు అనుమతివ్వడం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సోమవారం జనసేన పార్టీ నవీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మైనింగ్ తీస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి బంధువైన మేఘనాథ్ రెడ్డికి గ్రామస్తుల నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ స్థానిక సర్పంచ్ కి మాజీ సర్పంచ్ కి, వార్డ్ మెంబర్ కు కొంత మంది గ్రామ పెద్దలకు భయభ్రాంతులు పెట్టి డబ్బులు ఇచ్చి వారిని వశపరచుకుని గ్రామస్తులు ఎవరిని మాట్లాడని ఇవ్వకుండా చేసి మైనింగ్ తిస్తున్నారు. దీనంతటికీ కారణం ఏ.పీ.ఎం.డి.సి అధికారులు మరియు ఎస్టి కమిషన్ చైర్మెన్ కుంభా.రవిబాబు అండ చూసి కాల్ సైట్ మైనింగ్ తీస్తున్నారు. గతంలో పత్రికల్లో వార్తలు మైనింగ్ క్వారీ నిలుపుదల చేయాలని ప్రకటనలు చేసి హెచ్చరించినప్పటికీ ఎంత మాత్రాన్న గిరిజన చట్టాలను తూట్లు పొడుస్తూ వాటిని తుంగలో తొక్కుతూ గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ ఆదివాసి గిరిజనులకు అన్యాయం చేస్తూ కోట్లాది రూపాయలు విలువైన ఖనిజ సంపద దోచుకుపోతున్నారని ఆయన అన్నారు. గిరిజనుల ఆస్తి గిరిజనులే అమ్ముకోవాలని కుంభ రవిబాబు కు తెలియదా ఇంత జరుగుతున్నా ఎస్టీ కమిటీ చైర్మన్ పదవి పొంది ఉన్న పెద్దమనిషి తోటి గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కళ్ళు మూసుకొని ఉండడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా నిమ్మలపాడు కాల్ సైట్ మైనింగ్ లీజ్ ను రద్దు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎస్టి కమిషన్ కుంభ.రవిబాబు అధికార అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గిరిజన సంపదను దోచుకోవడమే లక్ష్యంగా చేసుకొని అమాయక గిరిజనుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని జనసేన పార్టీ నవీన్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. మైనింగ్ తవ్వకాలు నిలుపుదల చెయ్యకపోతే రవిబాబు గిరిజన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమని నవీన్ స్పష్టం చేశారు. గిరిజనులకు అన్యాయం జరిగితే గిరిజనులకు అండగా జనసేన పార్టీ నిలబడుతూ పోరాటం చేస్తది అని అన్నారు. ఈ కార్యక్రమం జనసేన మండల అధ్యక్షులు చిట్టం మురళి వీర మహిళా రత్నప్రియా పాల్గొన్నారు.