త్రిష-శింబు పెళ్లి

కోలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ శింబు, త్రిషల మధ్య ప్రేమాయణం గత పదేళ్లుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. వీరిద్దరు కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. వీరు పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైంలోనే వీరి మధ్య గ్యాప్ రావడంతో ఎవరి దారులు వారివి అయ్యాయి.

కాగా, లాక్‌డౌన్‌ సమయంలో త్రిష-శింబు కలిసి ‘కార్తీక్‌ డయల్‌ సేతా యెన్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల ప్రకటించారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలోనే వివాహం చేసుకోనున్నారంటూ.. తమిళ మీడియాలోనూ.. లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరూ దగ్గరయ్యారని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారని జాతీయ మీడియా కూడా కథనాలు రాసింది.

ఈ వార్తలపై అటు, త్రిష ఇటు శింబు ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల విషయమై శింబు తండ్రి టి.రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా శింబు, త్రిష పెళ్లి గురించి రాజేందర్‌ను ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాజేందర్ సమాధానం చెప్పలేదు. పెళ్లి వార్తను ఖండించకుండా రాజేందర్ ఆ ప్రశ్నను దాటవేయడం సంచలనంగా మారింది. దీంతో కోలీవుడ్ మీడియాలో మళ్లీ త్రిష-శింబు పెళ్లి వార్తలు మొదలయ్యాయి.